NTV Telugu Site icon

PVN Madhav: బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్

Mlc Madhav

Mlc Madhav

ఏపీలో జనసేనతో కలిసి నడుస్తామన్నారు బీజేపీ నేత సునీల్ థియోధర్. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఏపీలో అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని అబద్ధాలు చెబుతున్నారు….నరేంద్ర మోడీ, బీజేపీ నెంబర్-1. ఏపీలో టీడీపీ,వైసీపీ విఫలం అయ్యాయి. రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం నుంచి పోయిలో పడ్డట్టుగా ఉందన్నారు సునీల్ ధియోధర్. ప్రాంతీయ, కుటుంబ పార్టీలతో నష్టం జరుగుతోంది. ఏపీకి న్యాయం చేయగలిగేది బీజేపీ ఒక్కటే అన్నారు. ప్రజల తరపున రోడ్డెక్కి పోరాడతాం అన్నారు. ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు కొనసాగుతుంది. రెండుపార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల తరపున పీవీఎన్ మాధవ్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: Top Headlines @5PM: టాప్ న్యూస్

జనసేన తో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తున్నాం అని ప్రకటించారు సునీల్ ధియోధర్. ఆంధ్ర ప్రదేశ్ ను పునర్నిర్మించడం ఒక్క బీజేపీ – జనసేనకే సాధ్యం. మాధవ్ ను మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా గెలిపించాలని సునీల్ ధియోధర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు మాధవ్.

Read Also:Last Rites For Cow: గోమాతకు అంతిమ వీడ్కోలు.. ఘనంగా అంత్యక్రియలు