Site icon NTV Telugu

R5 zone : ఆర్5 జోన్ కేసులో స్టేకు సుప్రీం నిరాకరణ.. ఏపీ సర్కార్ కు రిలీఫ్

Sc

Sc

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు వ్యవహారం కొంత కాలంగా న్యాయపరమైన వివాదంగా మారింది. ఆర్ 5 జోన్ ఏర్పాటు పైన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో, రెండు జిల్లాలకు చెందిన పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి రంగం సిద్దమైంది. హైకోర్టు తీర్పు పైన రైతులు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. స్టే ఇవ్వాలని కోరడంతో న్యాయస్థానం తిరస్కరించింది.

Also Read : Snake House: అది ఇల్లు కాదు.. పాముల పుట్ట.. కష్టపడి ఇల్లు కొనుగోలు చేస్తే..

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేసులో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లటానికి మార్గం క్లీయర్ అయింది. ఆర్ -5 జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు కూడా ప్రస్తుతం రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీజే వద్ద ఆదేశాలు తీసుకోవాలని ఈ కేసు విచారించిన జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా. ప్రముఖ న్యాయవాదులు హరీష్ సాల్వే ముకుల్ రోహిత్గీ అమరావతి రైతుల తరఫున వాదించారు.

Also Read : Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు

అమరావతి పరిధిలోని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50 వేల మంది పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ కూడా జరిగింది. అక్కడ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఈ నెల 18న సీఎం జగన్ అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేశారు.

Exit mobile version