NTV Telugu Site icon

Bhumana Karunakar Reddy: తిరుపతిపై పవన్ దాడికి దిగుతున్నట్టుంది.. ఎమ్మెల్యే భూమన ఫైర్

Bhumana On Pk

Bhumana On Pk

Bhumana Karunakar Reddy Fires On Pawan Kalyan Tirupati Visit: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుపతికి వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేయడం కోసం ఆయన తిరుపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే.. పవన్‌పై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సీరియస్‌ అయ్యారు. వినతిపత్రం పేరుతో తిరుపతికి పవన్‌ దండయాత్రకు వస్తున్నట్టుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు లేదని.. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిపై దాడికి దిగుతున్నట్టు ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యబద్దంగా ఉన్న వైసీపీపై పవన్ నిత్య నిందలు వేస్తూనే ఉన్నాడని మండిపడ్డారు. తనకు ఓటు వేస్తే ఏం చేస్తాడో ప్రజలకు చెప్పకుండా.. నిత్యం పగ, ప్రతీకారాలతో భీష్మ ప్రతిజ్ఞలను పవన్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అనేది తప్ప, మేము అనేది పవన్ నోటి నుంచి రాదని పేర్కొన్నారు.

Woman Loots 27 Men: ఒక మహిళ.. 27 మంది భర్తలు.. కథలో పెద్ద ట్విస్ట్

ఇదిలావుండగా.. జనసేన కార్యకర్తపై అంజు యాదవ్ చెయ్యి చేసుకున్న వ్యవహారం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. ఖాకీ దుస్తుల్లో హుందాగా ప్రవర్తించాల్సిన ఆమె.. అందుకు భిన్నంగా విచిత్రంగా ప్రవర్తించడం, ఓ వ్యక్తిపై చెయ్యి చేసుకోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ ఇష్యూపై తిరుపతి ఎస్పీ రాష్ట్ర డీఐజీకి రిపోర్ట్ కూడా సమర్పించారు. అయితే.. ఇంతవరకూ ఆమెపై చర్యలు తీసుకోకపోవడంతో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. ఆమె ప్రవర్తనకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. తమ జనసేన కార్యకర్తపై చెయ్యి చేసుకున్న ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్నారు. పవన్ తిరుపతిలో ల్యాండ్ అయ్యాక.. భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో పాల్గొనేందుకు జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు సైతం వీరిని అదుపు చేయలేకపోయారు.

Boy Killed Brother: చేపల విషయంలో గొడవ.. తమ్ముడ్ని చంపిన అన్న