NTV Telugu Site icon

Bhumana Karunakar Reddy: ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదు

Bhumana Ttd Chairman

Bhumana Ttd Chairman

Bhumana Karunakar Reddy Comments After Selected As TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన భూమన కరణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో ముచ్చటించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదన్నారు. సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తామన్నారు. గతంలో ఏ విధంగా పనిచేశామో.. అంతకు మించిన విధంగా సామాన్య భక్తుల కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. రెండోసారి వేంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వేంకటేశ్వర స్వామి కృప, సీఎం జగన్ ఆశీస్సులతో తనకు ఈ అవకాశం లభించింద్నారు.

Kishan Reddy: మోడీ నాయకత్వంలో అభివృద్ధి బాటలో ఇండియన్ రైల్వే

తమ అధినేత జగన్ ఇచ్చిన ఈ అవకాశాన్ని తాను తు.చ. తప్పకుండా పాటిస్తూ.. మంచి పేరు తీసుకొస్తానని భూమన పేర్కొన్నారు. గతంలో లాగా హిందు ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. 15 సంవత్సరాల తరువాత తనకు మళ్లీ టీటీడీ ఛైర్మన్ పదవి దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి హాయంలో చైర్మన్‌గా పనిచేశానని, ఇప్పుడు తనయుడు హాయంలో చైర్మన్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇది కూడా వెంకన్న ఆశీస్సులతో లభించిందని భావిస్తున్నానని చెప్పారు. తండ్రి దగ్గర, కొడుకు దగ్గర పనిచేసే అవకాశం.. బహుశా ఇంకెవరికీ రాకపోయి ఉండొచ్చని చెప్పుకొచ్చారు.

Platform Fee: స్విగ్గీ బాటలోనే జొమాటో.. ఫుడ్ డెలివరీ ఒక నుంచి కాస్లీ

కాగా.. ప్రస్తుత టీటీడీ పాలకమండలి గడువు ఆగస్టు 8న ముగుస్తున్నందున, కొత్త పాలకమండలిని నియమించాల్సి ఉందని పేర్కొంటూ టీడీడీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టీటీడీ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గా ఆయన నియామకం తర్వాత సభ్యుల నియామకం కూడా చేపడతామని ప్రభుత్వం ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆగస్టు 8న ప్రస్తుత బోర్డు పదవీకాలం ముగిసిన అనంతరం కొత్త పాలకమండలి ఛైర్మన్‌గా కరుణాకర్‌రెడ్డి నియామకం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.