NTV Telugu Site icon

Bhumana Karunakar Reddy: రాజకీయం వద్దు.. రాయలసీమకు ద్రోహం చేయొద్దు..

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

మూడు రాజధానులపై ముందుకు వెళ్తున్న అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ… ప్రజల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తోంది.. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలతో విశాఖ గర్జన జరగగా.. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలోనూ ఉ్యమానికి శ్రీకారం చుట్టింది… తిరుపతి వేదికగా మహా ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.. ఈ సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ఫ్లెక్సీలు ఆవిష్కరించారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికి జరగదు, రాయలసీమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం.. పదండి.. అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. రాయలసీమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రజలు అందరూ సంఘీభావం ప్రకటించేందుకు సిద్దంగా ఉన్నారన్న భూమన.. పరిపాలన వికేంద్రీకరణకు విద్యార్థులు, ప్రజలు.. సీఎం వైఎస్‌ జన్మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు.

Read Also: Farmhouse MLA Audio Leak: ఫామ్ హౌస్ ఘటనలో బయటికొచ్చిన సంచలన ఆడియో

రాయలసీమ ఆత్మగౌరవం యాత్రకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం… కానీ, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు దీనిని రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు భూమన కరుణాకర్‌రెడ్డి.. ఇలాంటి విషయాల్లో రాజకీయం సరికాదు.. రాయలసీమకు ద్రోహం చేయొద్దు అని హితవుపలికారు.. ఇక, ప్రైవేట్‌ స్కూళ్లు, జూనియర్ కాలేజీ యాజమాన్యాలు స్వచ్ఛందంగా ఈ మహా ప్రదర్శనలు పాల్గొంటాయని వెల్లడించారు.. కాగా, ఈనెల 29వ తేదీన మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.. రాయలసీమ గొంతును మహా ప్రదర్శన ద్వారా చాటిచేబుదాం.. రాయలసీమకు న్యాయ రాజధాని కావాలి… అప్పుడే వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందుతుందంటున్నారు.. ఏపీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ బాగా వెనుకపడ్డాయి.. అందుకే సీఎం వైఎస్‌ జగన్‌.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.