NTV Telugu Site icon

Bhuma Akhila Priya: జగత్ విఖ్యాత్ రెడ్డికి ప్రాణహాని..!

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పాలక ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం సాగుతోంది.. ఆళ్లగడ్డలో అభివృద్ధి పేరట అక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ఆరోపిస్తున్నారు.. ఆధారాలతో సహా నిరూపిస్తానని.. నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేసిన ఆమె.. మరి రాజకీయ సన్యాసానికి మీరు సిద్ధమా అంటూ స్థానికల ఎమ్మెల్యేకు సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే.. ఇక, ఇవాళ మీడియాతో మాట్లాడిన అఖిలప్రియ.. తన సోదరుడు జగన్‌ విఖ్యాత్‌ రెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఆరోపించారు.

Read Also: YS Jagan: గ్రామ సచివాలయాల్లో మరింత వేగంగా రిజిస్ట్రేషన్లు..!

ప్రజల కోసం భూమా నాగిరెడ్డి కట్టించిన బస్ షెల్టర్ కూల్చివేతను అడ్డుకున్న జగత్ విఖ్యాత్ రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డారు భూమా అఖిలప్రియ.. ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండా పబ్లిక్ పాపర్టీ అయిన బస్ షెల్టర్‌ను కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. ప్రశ్నించినందుకు విఖ్యాత్ పై పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని.. తప్పు చేశాడని నిరూపిస్తే విఖ్యాత్‌ను నేనే పోలీసుల దగ్గరకు తీసుకెళ్తా అన్నారు. కానీ, పోలీసుల నుంచి జగత్ విఖ్యాత్ రెడ్డికి ప్రాణహాని ఉందని ఆరోపించారు అఖిలప్రియ. అభివృద్ధి పేరుతో జరుగుతున్న అక్రమాలను రేపు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.. కూల్చివేతల వల్ల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. కూల్చివేతల వల్ల నష్టపోయిన బాధితుల తరుపున న్యాయ పోరాటం చేస్తానన్నారు భూమా అఖిలప్రియ.