NTV Telugu Site icon

Bhuma Akhila Priya: రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు రెడీ.. మీరు సిద్ధమా..?

మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆళ్లగడ్డలో జరుగుతోన్న అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ప్రకటించారు.. ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ పేరుతో వైసీపీ నేతలు ప్రజలను లూటీ చేస్తున్నారు.. ప్రజలకు పరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రోడ్ల విస్తరణ పేరుతో వసూళ్లపై కలెక్టర్ దగ్గర విచారణకు రావాలని డిమాండ్‌ చేసిన ఆమె.. అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయలకు గుడ్ బై చెప్పేస్తానని సవాల్‌ విసిరారు.. ఇదే సమయంలో అవినీతి రుజువైతే రాజకీయ సన్యాసం చేసే దమ్ము ఎమ్మెల్యేకి ఉందా? అంటూ సవాల్‌ చేసిన అఖిలప్రియ.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాతపూర్వకంగా కలెక్టర్‌కు ఇస్తానన్నారు.. అవినీతికి పాల్పడలేదనే ధైర్యం ఉంటే రాజీనామా పత్రం తీసుకుని కలెక్టర్ ముందుకు వచ్చే ధైర్యం ఎమ్మెల్యేకి ఉందా? అని ఛాలెంజ్‌ చేశారు.. రెండు రోజులలో కలెక్టర్ ని కలిసి ధర్నా చేస్తాం… ప్రభుత్వానికి తాము దానం చేసిన స్థలంలో కట్టిన స్టేడియానికి మా అబ్బ పేరు పెట్టుకున్నాం… ప్రజా ధనంతో మున్సిపల్‌ స్థలంలో కట్టిన ఆఫీసుకి ఎమ్మెల్యే అబ్బ పేరు పెట్టుకోవడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Alliance: కాంగ్రెస్‌కే అతి గతి లేదు.. వాళ్లతో పొత్తా..?