పులుల పేరు చెబితే తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పులులు ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. టైగర్ ట్రాకింగ్ లో బయటపడ్డ ఆడ, మగ పెద్ద పులులు సంచారం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఏజెన్పీ ప్రాంతాల్లో ఎక్కడినించి పులులు వస్తాయోనని జనం భయపడిపోతున్నారు. ముఖ్యంగా పాడేరు అటవీ డివిజన్ పరిధిలోని రభ బీట్ ఏరియాలో మగ పులి….విజయనగరం అటవీ ప్రాంతంలో ఆడపులి కదలికలు కనిపించాయి. దీంతో అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు.
Read Also: Bhakthi Tv Stothra parayanam Live: ఈ స్తోత్రపారాయణం చేస్తే 2023లో పట్టిందల్లా బంగారమే
.
ఒడిషా నుంచి వచ్చిన పులుల కదలికలపై కొనసాగుతుంది ఫారెస్ట్ వాచ్.. ఈ ఏడాది ప్రారంభంలో ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలో ప్రవేశించిన పెద్ద పులులు ఎంత అలజడి కలిగించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే ఏపీలో పులుల సంఖ్య భారీగా పెరిగిందని అటవీ శాఖ అధికారుల అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవిశాఖ మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏపీలో దాదాపుగా 75 పులులు సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని ఆయన వివరించారు. శేషాచలం అటవిప్రాంతాన్ని కారిడార్‌గా చేసుకుని పులులు సంచరిస్తున్నాయని, ఇవి పాపికొండల వైపు కూడా సంచరిస్తున్నాయని గతంలో ఆయన ప్రకటించారు.2018లో ఉన్న పులుల సంఖ్య కంటే 60 శాతం పులులు పెరిగాయని వివరించారు. భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జనసాగర్ , శ్రీశైలం మధ్య ఉంది. దీంతో పాటు విశాఖ, ఏజెన్సీ ఏరియాల్లో పులులు అలజడి కలిగిస్తున్నాయి.
కాకినాడ జిల్లాలో, తుని మండలం కుమ్మరిలోవలో గతంలో పులి సంచరించింది. అది తర్వాత అనకాపల్లి వైపు తరలిపోయింది. పాయకరావుపేట మండలంలో, నర్సీపట్నంలో తాండవ నది పరివాహక ప్రాంతంలో ఆహారం కోసం పులి వలస వెళ్ళిపోయింది. ఇలా పులులు తూర్పుగోదావరి, విశాఖ, పాడేరు ప్రాంతాల్లో సంచరిస్తూ జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పులులు రోడ్లమీదకి రావడం, అటవీ అధికారులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించడం, ప్రజల్ని అప్రమత్తం చేయడం తెలిసిందే.
Read Also: Rishabh Pant: రిషబ్ పంత్‌ను రక్షించిన డ్రైవర్, కండక్టర్లకు సత్కారం..