చంద్రబాబు నన్ను బలిపశువును చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీద మస్తాన్ రావు.. ఏపీలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన సీఎం వైఎస్ జగన్.. బీద మస్తాన్ రావుకు కూడా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వైసీపీ రాజ్యసభ అభ్యర్థి బీద మస్తాన్ రావు… పెద్దల సభకు ముఖ్యమంత్రి జగన్ నన్ను పంపించటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.. జాతీయ స్థాయిలో వెళ్లటం అరుదైన అవకాశంగా పేర్కొన్న ఆయన.. నేను వైసీపీలో బేషరతుగా చేరాను.. ఎంపీ విజయసాయిరెడ్డి సూచనతో పార్టీలో చేరినట్టు వెల్లడించారు.
Read Also: Buddha Venkanna: టీడీపీ బీసీ నేతలే జగన్‌కు దిక్కయ్యారు..!
ఇక, రాజకీయాల్లో పార్టీలు మారడం చిన్న విషయమేనని.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వ్యక్తే కదా? అని ప్రశ్నించారు.. ఇదే సమయంలో.. టీడీపీ నాకేం పదవులు ఇవ్వలేదు.. ప్రజా క్షేత్రంలో నిలబడి ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తుచేసుకున్నారు బీద మస్తాన్ రావు.. మొన్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయమని చెప్పి నన్ను చంద్రబాబు బలిపశువును చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తానని వెల్లడించారు వైసీపీ రాజ్యసభ అభ్యర్థి బీద మస్తాన్ రావు.