Accident in Bapatla: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఢీ కొట్టడంతో నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు. మృతులంతా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బంధువులుగా గుర్తించారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కొడుకు పెళ్ళి సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత్ లో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బాపట్లలోని పాండు రంగాపురంలో సంగీత్ లో పాల్గొని తిరిగి వెళ్తుండగా కర్లపాలెం మండలం సత్యవతిపేట దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే బావమరిది బేతాళం బలరామరాజు, బేతాళం లక్ష్మీ, గాదిరాజు పుష్పావతి, ముదుచారి శ్రీనివాసరాజుగా గుర్తించారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహాలను బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం తర్వాత కర్లపాలెం తరలించారు.