NTV Telugu Site icon

Chandrababu: ప్రజల్లో జగన్ రెడ్డి పై తీవ్ర అసహనం కనిపిస్తుంది..

Babu

Babu

బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ నీ పని, నీ పార్టీ పని ఫినిష్ అని విమర్శించారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే నీకు నిద్ర పట్టదు.. నీ అవినీతి డబ్బు, అధికార దుర్వినియోగం ఆపుతుందా అని దుయ్యబట్టారు. ప్రజల్లో జగన్ రెడ్డి పై తీవ్ర అసహనం కనిపిస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ సభ కోసమని.. సభా ప్రాంగణానికి ఓ రైతు భూమి ఇస్తే నోటీసులు ఇస్తారని మండిపడ్డారు. మీటింగ్ జరగటానికి వీలు లేదు అంటారా.. మేము చట్ట ప్రకారం పోతున్నామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు జగన్ రెడ్డికి అభ్యర్ధులు దొరక్క సందిగ్ధంలో పడిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ భవిష్యత్తు కోసం నేను ఇక్కడకు వచ్చాను.. మీ స్పందన చూస్తుంటే నాకు ముందే గెలుపు కనిపిస్తుందని అక్కడి జనాలను చూసి చంద్రబాబు మాట్లాడారు. అందరం జాగ్రత్తగా ఉండకపోతే ఈ రావణాసురిడితో కష్టమని ఆరోపించారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన అధికారం అడ్డం పెట్టుకుని 43 వేల కోట్లు దోచుకున్నాడని దుయ్యబట్టారు. ఊరూరా తిరిగి ముద్దులు పెట్టాడు.. తల నిమిరాడు.. అందరూ కరిగిపోయారన్నారు. ముఖ్యమంత్రి అయ్యాడు.. రాష్ట్రాన్ని చెరబట్టాడు.. వ్యవస్థలు మొత్తాన్ని సర్వనాశనం చేశాడని తెలిపారు.

జగన్ రెడ్డి ఆయన అన్నం తినటం మానేశాడు.. ఉదయం అల్పాహారం ఇసుక, మధ్యాహ్నం భోజనం మైన్స్, రాత్రి డిన్నర్ జే బ్రాండ్ మద్యం సేవిస్తున్నారని విమర్శించారు. కప్పం చెల్లించకపోతే గ్రానైట్ పరిశ్రమ యజమానులపై కేసులు పెట్టారు.. మైనింగ్ అధికారులు కారం పట్టుకుని ఫ్యాక్టరీల చుట్టూ తిరుగుతున్నారు.. అధికారం ఉందని అంబోతుల్లా ఊరి మీద పడ్డారని తెలిపారు. ఆంబోతులకు కళ్లెం వేసి ఆపుతానని పేర్కొన్నారు. మరోవైపు.. పార్టీ మారలేదని అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ పై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. తాను, పవన్ కళ్యాణ్ సహా అందరూ బాధితులమే.. దోపిడీ తప్పంటే మనపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.