Site icon NTV Telugu

Bandla Ganesh: రంభల రాంబాబు గారికి త్వరలో మా సార్ సమాధానం చెప్తారు

Bandla Ganesh Setires

Bandla Ganesh Setires

Bandla Ganesh: సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య వార్ నడుస్తోంది. ఆగస్టు 15న మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ పట్ల పెద్ద చర్చ నడుస్తోంది. కాటన్ దుస్తుల ఛాలెంజ్‌లు ఆపి 175 సీట్లకు పోటీ చేస్తున్నారో లేదో ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ పట్ల ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు. ‘అలాగే రంభల రాంబాబు గారూ.. మా సార్ త్వరలోనే మీకు సమాధానం చెప్తారు.. జై పవన్ కళ్యాణ్’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే బండ్ల గణేష్ ట్వీట్‌పై వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. త్వరలో అంటే ఎన్నాళ్లు పడుతుందో చెప్పాలని నిలదీస్తున్నారు. ఫామ్‌ హౌస్‌లో రెస్ట్ తీసుకున్న తర్వాత చెప్తారా అంటూ కొందరు వైసీపీ కార్యకర్తలు బండ్ల గణేష్‌ను నిలదీస్తున్నారు.

కొందరు అయితే పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. తొలుత పవన్‌ కళ్యాణ్‌ను ఎమ్మెల్యేగా గెలవమని చెప్పాలని బండ్ల గణేష్‌కు సూచనలు ఇస్తున్నారు. ఈ ఛాలెంజ్ స్వీకరించాలంటే బండ్ల గణేష్‌కు మరోసారి బ్లేడ్ కావాలా అని కొందరు కౌంటర్లు ఇస్తున్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్న వాళ్లు అంబటి రాంబాబు ట్వీట్ పట్ల ఎందుకు స్పందిస్తారని కొందరు బండ్ల గణేష్‌ను ప్రశ్నిస్తున్నారు.

అటు మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ పట్ల జనసేన నేత నాగబాబు కొణిదెల కూడా స్పందించారు. ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘బాబూ.. ఓ రాంబాబు.. జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్‌కి, వైసీపీ సర్కస్‌లో నీలాంటి బఫూన్ గాళ్లు అడిగే క్లారిఫికేషన్స్‌కు సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జనసైనికులకు లేదు.. మా ప్రెసిడెంట్ గారికి అంతకంటే లేదు’ అంటూ నాగబాబు కౌంటర్ ఇచ్చారు.

Exit mobile version