Balineni: సొంత పార్టీపై చంద్రబాబుకు నమ్మకం లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రస్తుతం పొత్తుల రాజకీయం హాట్ హాట్‌గా నడుస్తోంది. కర్నూలు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ మంత్రులు, కీలక నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనేక సంవత్సరాలు సీఎంగా పనిచేశారని, అయినప్పటికీ ఆయనకు సొంత పార్టీపై నమ్మకం లేదని బాలినేని విమర్శించారు. అందుకే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో కలిసినా, ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా జగన్‌ను ఏమీ చేయలేరని బాలినేని స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబుకు పొత్తు కావాల్సిందేనని.. తాను గెలుస్తానో, లేదో అన్న అభద్రతాభావం చంద్రబాబులో ఉందన్నారు. కానీ జగన్ సొంతంగా పార్టీ పెట్టి, ఒక్కడే పోరాడి అధికారంలోకి వచ్చారని బాలినేని గుర్తు చేశారు. కానీ చంద్రబాబుకు ఆ ధైర్యం లేదని, ఇతర పార్టీల పొత్తు కోరినప్పుడే జగన్‌ను ఎదుర్కోలేక పోతున్నారన్న విషయం స్పష్టమవుతుందని బాలినేని అన్నారు. గత మూడేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని.. ప్రజలే తమ బలమని బాలినేని పేర్కొన్నారు.
Also Read
Ambati Rambabu: జనసేన పార్టీని పెట్టింది చంద్రబాబును సీఎం చేయడానికా?
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!