కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముగిసే సమయానికి ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఏంలను పోలింగ్ సిబ్బంది సీల్ చేస్తున్నారు. అనంతరం ఈవీంఏంలను భారీ భద్రతతో స్ట్రాంట్ రూంకి తరలించనున్నారు.
అయితే సాయంత్రం 5 గంటలకు వరకు 59 గా పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారుల వెల్లడించారు. 2019లో 77 శాతం పోలింగ్ నమోదు కాగా.. ప్రస్తుతం ఈ ఉప ఎన్నికలో గతం కంటే పదిశాతం వరకు తగ్గిందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే వచ్చే నెల 2న కౌంటింగ్ నిర్వహించనున్నారు.