NTV Telugu Site icon

MLA Sudhakar: వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసిన వృద్ధురాలు..!

Mla Sudhakar

Mla Sudhakar

ప్రజా ప్రతినిధులంతా ప్రజల వద్దకు వెళ్లేలా గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. అయితే, కొన్ని ప్రాంతాల్లో ప్రజలనుంచి ప్రజా ప్రతినిధులకు నిరసన తప్పడంలేదు, తాజాగా, కర్నూలు జిల్లా కోడుమూరులో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధాకర్‌ను నిలదీశారు ఓ వృద్ధురాలు.. సీఎం జగన్ వచ్చాక అన్నీ ఇస్తున్నాడు.. కానీ, అన్ని ధరలు పెంచాడని ఆ వృద్ధురాలు నిలదీసింది ఆమె.

Read Also: Nageswara Rao: ఆంధ్రప్రదేశ్‌ని “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చేయండి..!

చిరు వ్యాపారులకిచ్చే సహాయం రాలేదు.. ఈ వయసులో కూడా కష్టపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ఆ వృద్ధురాలు.. గ్యాస్, నిత్యావసర సరుకులు, కరెంట్ బిల్లులు అన్నీ పెంచారు.. మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. మా బాధలు మీకు చెబుతున్నాం.. మీరు అక్కడ చెప్పండి అంటూ ఎమ్మెల్యేకు సూచనలు చేసింది ఆ మహిళ.. అయితే, గ్యాస్ ధరలు, వంటనూనెల ధరలు పెంచింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారేనని.. ఆ మహిళకు సముదాయించారు ఎమ్మెల్యే సుధాకర్‌.. అన్నీ కేంద్ర ప్రభుత్వం పెంచింది.. సీఎం జగన్‌కు సంబంధంలేదన్నారు.. జగన్‌ సీఎం అయిన తర్వాత పెన్షన్‌ ఇంటి దగ్గరకే వస్తుంది కదా? అని ఆ వృద్ధురాలిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, కోడుమూరులోనే నీరు, స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించారు స్థానిక మహిళలు..