Site icon NTV Telugu

Avanthi Srinivas: చంద్రబాబుకి అమరావతి మీదే ప్రేమ.. అవంతి ఫైర్

అమరావతిని రాజధానిగా చేస్తాం.. విశాఖను అభివృద్ధి చేస్తామంటూ గురువారం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు… ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకి అమరావతి మీదే ప్రేమ.. విశాఖకు పరిపాలన రాజధాని చంద్రబాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? అంటూ మండిపడ్డారు. విశాఖలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికలకు వెళ్తే ప్రజల తీర్పు ఏమిటో తెలుస్తుందని సవాల్‌ విసిరారు. ఇక, సీఎం వైఎస్‌ జగన్‌ది ఐరన్ లెగ్ అంటూ చంద్రబాబు చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు.. సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి.. విశాఖలో ఏమి దోచుకున్నారో చెప్పాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు అవంతి శ్రీనివాస్‌.

Read Also: Power Crisis: భారత్‌లో విద్యుత్​సంక్షోభం.. 1100 రైళ్లు రద్దు..!

Exit mobile version