Site icon NTV Telugu

Auto Driver Harassment: బాలికకు ఆటోడ్రైవర్ వేధింపులు

ఏపీలో మహిళలపట్ల దారుణాలు ఆగడం లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళల్ని, బాలికల్ని టార్గెట్ చేస్తున్నారు కొందరు మృగాళ్ళు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి అత్యాచార ఘటన మరువక ముందే మరో బాలికపై అత్యాచార ప్రయత్నం జరిగింది. నూజివీడుకు చెందిన మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇంటికి తీసుకుని వెళ్తా అని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళాడు ఆటో డ్రైవర్. 5వేలు డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వు లేదంటే నైట్ మొత్తం నాతో గడువు అంటూ బాలికతో అసహ్యంగా ప్రవర్తించాడా ఆటో డ్రైవర్.

చేతులు పట్టుకోవటంతో తప్పించుకుని పారిపోయింది ఆ మైనర్ బాలిక. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిందా బాలిక. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేసి సెక్షన్ 363 ,354, IPC 506, పొక్సో యాక్ట్ నమోదు చేశారు. ఫేస్ బుక్ ప్రియుడు ఆంజనేయులును కలిసేందుకు స్నేహితులతో విజయవాడ వచ్చింది ఆ బాలిక.

ప్రియుడు స్నేహితులతో కలిసి దుర్గమ్మను దర్శించుకుని ఇంటికి వెళ్లిపోయింది స్వాతి. ఇంట్లో పెళ్లి చేస్తా అనటంతో మళ్ళీ ప్రియుడి కోసం వచ్చేసిందా బాలిక.ఆంజనేయులు ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతడిని వెతుకుతూ ఆటో ఎక్కింది. మొత్తం తిప్పి రాత్రవ్వటంతో మా ఇంటికి రా రేపు వెళ్ళిపోవచ్చు అంటూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు ఆటో డ్రైవర్. డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోతే నాతో గడువు అంటూ పిచ్చి చేష్టలకు పాల్పడ్డాడు. ఎలాగోలా తప్పించుకుంది బాలిక. వరుస ఘటనలతో మహిళలు, బాలికలు ఆందోళనకు గురవుతున్నారు.

Robberies in Temples: రెచ్చిపోతున్న దొంగలు.. ఆలయాలు, ఏటీఎంలలో చోరీలు

Exit mobile version