ఆంధ్రప్రదేశ్ లో అడగడుగునా అత్యాచారాలు, వేధింపులు. అసలు శాంతిభద్రతలు వున్నాయా అనే అనుమానం కలుగుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో నేరాలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విజయవాడ, దుగ్గిరాల, రేపల్లె.. తాజాగా విజయనగరంలో మహిళలపై దారుణ అత్యాచారాలు అందరినీ కలిచివేస్తున్నాయి. మీలో చలనం రావాలంటే ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి జగన్ గారు? అంటూ టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో అర్థరాత్రి ఘోరం జరిగినా సీఎం జగన్ మనస్సు కరగదా? అన్నారు. మహిళా…
ఏపీలో మహిళలపట్ల దారుణాలు ఆగడం లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళల్ని, బాలికల్ని టార్గెట్ చేస్తున్నారు కొందరు మృగాళ్ళు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి అత్యాచార ఘటన మరువక ముందే మరో బాలికపై అత్యాచార ప్రయత్నం జరిగింది. నూజివీడుకు చెందిన మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇంటికి తీసుకుని వెళ్తా అని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళాడు ఆటో డ్రైవర్. 5వేలు డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వు లేదంటే నైట్ మొత్తం నాతో గడువు అంటూ…
హోం మంత్రి తానేటి వనితపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా తానేటి వనిత రాజీనామా చేయాలన్నారు. తల్లులను బయటికి తీసుకొచ్చి హోంమంత్రి కించపరుస్తూ ఉన్నారు. రేపల్లె రైల్వే స్టేషన్లో అత్యాచారం ఘటన ఏ తల్లి పెంపకం తప్పో హోంమంత్రి చెప్పాలి. మీ చేతగానిపాలన అసమర్ధ పాలన వల్ల…