NTV Telugu Site icon

Attack on TDP Office: గన్నవరంలో టెన్షన్‌ టెన్షన్‌.. టీడీపీ ఆఫీసుపై వంశీ వర్గీయుల దాడి..!

Attack On Tdp Office

Attack On Tdp Office

Attack on TDP Office: మరోసారి గన్నవరం గరంగరంగా మారింది.. కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడి చేశారని చెబుతున్నారు.. అయితే, వల్లభనేని వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయల్దేరారు టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న సమయంలో.. వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. దీంతో.. టీడీపీ, వంశీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది.. ఆ తర్వాత.. గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఆఫీసుపై వంశీ వర్గీయులు దాడి చేశారు.. ఈ దాడిలో టీడీపీ ఆఫీసు అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం అయ్యాయి.. అదే విధంగా ఆఫీసు ముందు పార్క్‌ చేసిన ఓ కారుకు కూడా నిప్పుపెట్టారు.

Read Also: PM Modi: పీఎం మోదీకి షాకిచ్చిన సీఎం.. ఎన్నికల ర్యాలీ నిర్వహణకు నో పర్మిషన్

గన్నవరంలో టీడీపీ, ఎమ్మె్ల్యే వంశీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం రెండు, మూడు రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది.. తాజాగా, ఎమ్మెల్యే వంశీ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు టీడీపీ నేతలు.. గన్నవరం టీడీపీ కార్యాలయం నుండి జాతీయ రహదారి పై నిరసనగా బయలుదేరి గన్నవరం పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే వంశీ అరాచకాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు.. డౌన్ డౌన్ వంశీ అంటూ నినదించారు.. ఈ సమయంలో.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ ఆఫీసు చుట్టూ కారులో తిరిగారని టీడీపీ నేతలు చెబుతున్నారు.. ఇక, టీడీపీ వాళ్లు గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లగానే.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు టీడీపీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు.. పెట్రోల్‌ డబ్బాలు, క్రికెట్‌ బ్యాట్లతో విరిచుకుపడి ఆఫీసులో అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు.. అక్కడే ఉన్న ఓ కారుకు నిప్పుపెట్టారు.. ఈ దాడిలు పలు కార్ల అద్దాలు ధ్వంసం అయినట్టు చెబుతున్నారు. దీంతో, గన్నవరంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి.

Show comments