Atchannaidu : అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను కూల్చడాన్ని ఖండిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని నర్సీపట్నంలో హైటెన్షన్ నెలకొంది. మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అయ్యన్న అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారాన్ని విధ్వంస దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చిందని ఆయన మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను కూల్చడాన్ని ఖండిస్తున్నా్న్న అచ్చెన్నాయుడు.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడిపై జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థంగా చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ గూండారాజుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆయన విమర్శలు గుప్పించారు.
అధికారంలో ఉన్న పక్షానికి పోలీసులు మద్దతుగా నిలిస్తే.. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే పోలీసులు, అధికారులు వడ్డీతో సహా మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు కోకొల్లలు అని, పోలీసుల అతిప్రవర్తన హద్దు అదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. నేరస్థుడు రాజ్యం ఏలితే ఎన్ని అనర్ధాలు చోటు చేసుకొంటాయో, అరాచక శక్తులు ఏ విధంగా చెలరేగిపోతాయో, ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా నాశనమవుతుందో మూడేళ్లలో జగన్ రెడ్డి పాలనలో జరిగిన ఉదంతాలే నిదర్శనమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Japan Earthquake: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
-
Anirudh : అనిరుథ్ – కావ్య మారన్ పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ మెంబర్
-
IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్‌కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!