NTV Telugu Site icon

Atchannaidu: గుంటూరు ఎస్పీకి అచ్చెన్న లేఖ

Atchannaidu

Atchannaidu

ఎస్సీ మహిళ వెంకాయమ్మకు రక్షణ కల్పించాలని గుంటూరు ఎస్పీకి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిని తెలిపిన ఎస్సీ మహిళ వెంకాయమ్మకు రక్షణ కల్పించాలని లేఖలో కోరిన అచ్చెన్న.లేఖలో కోరిన అచ్చెన్న.వైసీపీ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా తమ అసమ్మతి తెలుపుతున్న వారిపై దాడికి పాల్పడుతున్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు.ప్రభుత్వం పై తన అసమ్మతి తెలిపిన ఎస్సీ-మాల సామాజిక వర్గానికి చెందిన వెంకాయమ్మపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనం అన్నారు అచ్చెన్నాయుడు.

వెంకాయమ్మ నిరుపేద మహిళ.ఆమెకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిని స్థానిక వైసీపీ నాయకుడు అక్రమంగా ఆక్రమించుకున్నాడు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. మే 16న తన భూమి సమస్యపై ఫిర్యాదు చేసేందుకు గుంటూరు వెళ్లారు. కానీ స్పందనలో నుంచి ఎలాంటి స్పందన రాలేదు.స్పందన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై తన అసమ్మతిని తెలియజేసింది.

వైసీపీ ప్రభుత్వంపై తన అసమ్మతి తెలిపినందుకు స్థానిక వైసీపీ మద్దతుదారులు ఆమెపై భౌతిక దాడి చేసి ఇంట్లో ఉన్న కిరాణా సామాన్లు, పాత్రలు ధ్వంసం చేశారు. ఆమె కుమారుడిపై దాడి చేసి అతడి సెల్ ఫోన్‌ను ధ్వంసం చేశారు.ఆమెపై భౌతికంగా దాడి చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఆమెపై దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఆమెపై జరుగుతున్న విద్వేషపూరిత ప్రచారాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోండి.

అధికార వైసీపీ నాయకుల దాడులతో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలగడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు, ప్రజల భాగస్వామ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.అధికార వైసిపి అనుచరుల నుంచి వెంక‌య‌మ్మ‌ను కాపాడాల‌ని ఆమెకు భ‌ద్రత క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. దోషులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి. మీరు తీసుకునే సత్వర చర్యలు ప్రజాస్వామ్య విలువలను, ప్రాథమిక హక్కులను రక్షించడంలో దోహదపడతాయన్నారు.

Tdp Support Venkayamma: వెంకాయమ్మకు టీడీపీ అండ.. వైసీపీ దాడిపై ఖండన