Ashok Gajanatphi Raju comments on mahapadayatra
ఏపీలో అమరావతి రైతుల మహాపాదయాత్ర వివాదాస్పదం అవుతోంది. పాదయాత్రపై దాడులు జరగడం, తాజాగా హైకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో వారం పాటు తాత్కాలిక విరామం ప్రకటించారు అమరావతి రైతులు. మహాపాద యాత్రను అడ్డుకుని ఐడి కార్డులు అడుగుతున్నారు. ప్రభుత్వ వ్యవహారంతో పోలీసులు నవ్వులు పాలవుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత కుటుంబ సభ్యులు సంబంధించిన కేసు ట్రైల్ రన్ కు కూడా చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిని చిన్నికుమారి లక్ష్మి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిటీబ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతి రాజు, జిల్లా నేతలు పాల్గొన్నారు.
Read Also: Controversy: కరెన్సీ నోట్లపై నేతాజీ బొమ్మ ముద్రించాలి.. హిందూ మహాసభ వివాదాస్పద వ్యాఖ్యలు
అనంతరం అశోక్ మాట్లాడుతూ..,గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్ర పక్షాలకు సపోర్ట్ చేశాం. ఇప్పుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థినిగా టీడీపీ తరపున చిన్నికుమారి లక్ష్మీని బరిలో నిలిపాం. ప్రతీ ఒక్కరూ టీడీపీకి సపోర్ట్ చేసి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అమరావతి రైతుల పాదయాత్ర పై అశోక్ స్పందిస్తూ., రైతులు చేస్తున్న యాత్రను అడ్డుకుని ఐడి కార్డులు అడుగుతున్నారు. ప్రభుత్వ వ్యవహారంతో పోలీసులు నవ్వులు పాలవుతున్నారని అశోక్ గజపతిరాజు వాపోయారు.
స్వతంత్ర దేశంలో… స్వతంత్ర భావాలను లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అన్నారు. ప్రతీ ఒక్కరినీ భయపెడుతున్నారు. ఏపీలో రాజ్యాంగo అమలు కావడం లేదని రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రులే అంటున్నారని అశోక్ పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్ట్ ఈ వైసీపీ ప్రభుత్వంపై ఎన్నో మొట్టి కాయలు వేసింది . ఐనప్పటికీ మార్పు లేదన్నారు. మహనీయులను గౌరవించుకోవడం కోసమే పేర్లను పెట్టుకుంటాం, ఉన్న సంస్కృతిని పాడు చేయొద్దని అశోక్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read ALso: T20 World Cup: కాన్వే 92 నాటౌట్.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్