Site icon NTV Telugu

Holiday: ఉగాదికి సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. కొత్త జిల్లాల ఏర్పాటు వాయిదా

ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీని సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారి ముత్యాలరాజు నోటిఫికేషన్‌ జారీ చేశారు. గతంలో ఏప్రిల్ 2న కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఉగాది సెలవు లేదని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పలు విజ్ఞప్తులు రావడంతో అధికారులు సమీక్షించి కొత్త జిల్లాల ఏర్పాటును రెండు రోజుల పాటు వాయిదా వేశారు.

కాగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఏప్రిల్ 4న ప్రభుత్వం చేపట్టనుంది. ఆ రోజు నుంచి కొత్త జిల్లాలలో పాలన ప్రారంభం కానుంది. ఏప్రిల్ 4న ఉదయం 9:05 గంటల నుంచి 9:45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది.

https://ntvtelugu.com/toll-tax-to-increase-from-april-1st-in-andhra-pradesh/
Exit mobile version