Site icon NTV Telugu

APPSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మరో నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీపీఎస్సీ

Appsc

Appsc

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనే ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ).. తాజాగా మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది… ఈ సారి గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ… 92 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది… ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకారం… అక్టోబర్ 13వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఆ పోస్టులకు అన్ని అర్హతలు కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.. మరోవైపు.. రవాణా శాఖలో కూడా కొన్ని పోస్టుల భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది… రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీపీఎస్సీ… ఇక, ఎఎంవీఐ ఉద్యోగాలకు అర్హతలు కలిగినవారు నవంబర్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. ఇక, సంబంధిత పోస్టులకు కావాల్సిన అర్హతలు తెలుసుకోవడానికి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in ని సందర్శించాలని సెప్టెంబర్‌ 30వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది ఏపీపీఎస్సీ.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version