NTV Telugu Site icon

APCC Tulasi Reddy : బీజేపీ పార్టీ పెట్టిన సభ లాలూచీ, కుస్తీ సభ

APCC Working President Narreddy Tulasi Reddy Fired on BJP.

బీజేపీ రణభేరిపై ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఆయన మాట్లాడుతూ.. కడపలో బీజేపీ రణభేరి సభ పెట్టి మరోసారి రాయలసీమ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, కడపలో బీజేపీ పార్టీ పెట్టిన సభ లాలూచీ, కుస్తీ సభ అని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ 5 ఏళ్ళు ప్రకటిస్తే దాన్ని బీజేపీ అమలు చేయలేదన్నారు. బీజేపీ 7 సంవత్సరాలు రాయలసీమ ని మోసం చేస్తూనే ఉందని ఆయన విమర్శించారు. దొంగే దొంగా.. దొంగా అని అరిచినట్లు ఉంది, బీజేపీ వైఖరి అని అన్నారు. బీజేపీ రాయలసీమ ద్రోహి అని వ్యాఖ్యలు చేశారు.

సంజీవిని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిందని మండిపడ్డారు. దేశాన్ని బీజేపీ అప్పులకుప్ప చేస్తే రాష్ట్రాన్ని వైసీపీ అప్పుల కుప్పగా చేసిందన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం అన్న చేయాలి అంటూ ఆయన వ్యాఖ్యనించారు. అంతేకాకుండా శ్రీకాళహస్తి సమీపంలో మన్నవరం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిన విద్యుత్ పరికరాల ప్రాజెక్ట్‌ను మోదీ ప్రభుత్వం మూసివేసిందని తెలిపారు. రాయలసీమ వాళ్ళు ఫ్యాక్షనిస్టులు, రాయలసీమకు విమానాశ్రయం ఎందుకు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సీమ ప్రజలను అవమానపరిచారన్నారు.