సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిలోనూ నిరసనలు పెల్లుబికాయి. ధర్నా చౌక్ నిరసన లో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి, మస్తాన్ వలి, కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ సర్కార్ తీరుని ఎండగట్టారు. బీజేపీ చేయకూడని తప్పు చేస్తుంది. సోనియాను ఈడి విచారణకు తీసుకురావడం కుట్ర చర్యే.నేషనల్ హెరాల్డ్ మూసేసిన కేసు. సీఎం జగన్ కేంద్రానికి బానిసలాగా మారకూడదన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.
బీజేపీ దేశాన్ని నాశనం చేస్తుంది. బీజేపీ అకౌంట్లలో వేలాది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. సోనియా, రాహుల్ దేశ ఆస్తి. రాజ్యాంగ సంస్ధలను వాడుకొని వదిలేస్తామంటే కుదరదు. తక్షణమే సోనియాగాంధీ విచారణ ఆపాలి. ఆరెస్సెస్ దేశ ప్రజలకు సోనియా, రాహుల్ గాంధీలకు క్షమాపణ, చెప్పాలి. ప్రజలారా కాంగ్రెస్ పార్టీకి మద్ధతు తెలపాలని కోరుతున్నాం. ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మాట్లాడుతూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్, నెహ్రూ కుటుంబీకుల పైన వేధింపులకు దిగడం దారుణం.
2024లో బీజేపీని కాల గర్భంలో కలిపేయడం ఖాయం. సోనియా, రాహుల్ అగ్ని పునీతులుగా బయటకొస్తారన్నారు తులసిరెడ్డి. మరోవైపు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ద్వారా మోడీ సర్కార్ తన రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై ఎడతెగని ప్రతీకార ప్రచారం ప్రారంభించిందని మండిపడ్డారు విపక్ష నేతలు. మునుపెన్నడూ లేని విధంగా అనేక రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వేధిస్తోంది, సామాజిక నిర్మాణాన్ని నాశనం చేస్తున్న మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక , రైతు వ్యతిరేక , రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం అని విపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.
Son’s Revenge: తండ్రి హత్యకు తనయుడి ప్రతీకారం.. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి మరీ..