APCC Chief Gidugu Rudraraju Meeting with PCC Political Affairs Coordination Committees: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన గిడుగు రుద్రరాజు.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు అప్పుడే రంగంలోకి దిగారు. పీసీసీ రాజకీయ వ్యవహారాలు, సమన్వయ కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ బలోపేతం కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని వంటి కేంద్ర పరిధిలోని అంశాలపై ఆయన ఫోకస్ పెట్టనున్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాహుల్ గాంధీ ఇప్పటికే ఇచ్చిన హామీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, వివిధ ప్రజా సమస్యలపై.. క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధం కానున్నారు. జిల్లా పర్యటనలకు సిద్ధమవుతోన్న రుద్రరాజు.. ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు.
Himachal Pradesh: సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ప్రియాంకదే తుది నిర్ణయం!
ఈ సమావేశం అనంతరం పీసీసీ మీడియా కమిటీ కన్వీనర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రం ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతం అయ్యిందన్నారు. అది పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపిందని.. ఆ జోష్‌తో ముందుకు సాగుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయనున్నామని తెలిపారు. పంచముఖ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తోందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతో పాటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగిన సంక్షేమం, అభివృద్ధి, ప్రత్యేక హోదాపై అంశాలపై చర్చిస్తున్నామన్నారు. అలాగే.. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై చర్చలు సాగుతున్నాయని పేర్కొన్నారు. బూత్ లెవల్ కమిటీల్లో కనీసం ఐదుగురు సభ్యులు ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
Big Twist in Vaishali Case: వైశాలి కేసులో బిగ్ ట్విస్ట్.. మాకు ఏడాది క్రితమే పెళ్లైందంటున్న నవీన్
కాగా.. విజయవాడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం రుద్రరాజు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పూర్వ వైభవం సంతరించుకునేందుకు పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా సహకరించాలని కోరారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. తాను రెండు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్‌లోనే ఉన్నానని, అన్ని అనుబంధ శాఖలను కలుపుకుని ముందుకు సాగుతానని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమ స్వార్ధ ప్రయోజనాలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.