NTV Telugu Site icon

AP Super Speciality Hospitals: ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నోటీసు

Ap

Ap

AP Super Speciality Hospitals: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నోటీసులు ఇచ్చాయి. మా బకాయిలు మాకు ఇచ్చే వరకు ఇక ఆరోగ్యశ్రీ సేవలు నడపలేం అని వెల్లడించాయి. ఇకపై తగ్గేది లేదు అంటూ తమ డిమాండ్స్ ను ప్రభుత్వం ముందు పెట్టాయి. దీంతో ప్రజలకు కష్టాలు మరోసారి తప్పవు అని చెప్పాలి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇచ్చిన నోటీసులో.. మాకు రావాల్సిన బకాయిలు 1750 కోట్ల రూపాయలకు చేరిపోయాయి.. కాబట్టి ఇకపై తాము ఆరోగ్యశ్రీ సేవలు నడపలేం అని తేల్చి చెప్పాయి.

Read Also: Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి శరీరంలో 150 mg వీర్యం.. గ్యాంగ్‌రేప్..?

ఇక, మాపై దాడులు కూడా పెరిగిపోయాయి..మమల్ని దొంగలుగా చూపిస్తున్నారు. ఇన్ని రోజులుగా ఏపీ సర్కార్ బకాయిలు పెట్టినా మేం పని చేస్తున్నాం.. కానీ ఇకపై తగ్గేది లేదన్నాయి. మా బకాయిలు చెల్లించే వరకూ మేం ఆరోగ్యశ్రీ సేవలన అందించబోం.. ప్రభుత్వం ఇప్పటి వరకూ ఉన్న అన్ని బకాయిలు చెల్లించడంతో పాటు ఇక నుంచి ఎన్టీఆర్ వైద్య సేవల బిల్లులు క్రమపద్ధతిలో రిలీజ్ చేసే ఏర్పాటును కూడా చేయాలి అని ఆంధ్ర ప్రదేశ్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని కోరాయి.

Hs