Site icon NTV Telugu

AP SSC : నేటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..

Students Exam

Students Exam

Andhra Pradesh SSC Supplementary 2022 Exam Start From Today.

గత నెలలో ఏపీ విద్యాశాఖ పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి 6 లక్షల మందికి పైగా పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తే.. వారిలో 4.14 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అయితే ఫెయిల్‌ అయిన విద్యార్థులు విద్యాసంవత్సరాలన్ని నష్టపోకుండా ఉండేందుకు.. నెలలోపే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ స్లపిమెంటరీ పరీక్షలు జులై 15వ తేదీ వరకు జరుతాయని అధికారులు వెల్లడించారు. అయితే.. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

TTD : నేడు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..

అంతేకాకుండా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్షకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ఆనారోగ్యంగా ఉన్నవారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2,01,627 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించిన అధికారులు.. ఇప్పటికే హాల్‌ టికెట్లు విడుదల చేశామని వెల్లడించారు.

 

Exit mobile version