NTV Telugu Site icon

సీఎం జ‌గ‌న్ అనుకున్న‌ది సాధిస్తారు.. మాన్సాన్ ట్ర‌స్ట్ పై నిర్ణ‌యం కోర్టుదే..

Tammineni

సీఎం వైఎస్ జ‌గ‌న్ అనుకున్న‌ది సాధిస్తార‌ని తెలిపారు ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం.. సింహాచలంలో లక్ష్మీ నృసింహ్మ స్వామిని దర్శించుకున్నఆయ‌న‌కు ఘనంగా స్వాగతం ప‌లికారు ఆలయ ఈవో, అధికారులు, వైదిక వర్గాలు.. ఆ త‌ర్వాత గ‌ర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. పంచగ్రామాల భూసమస్య అన్నది నేను పుట్ట‌క ముందునుంచే ఉంద‌న్నారు.. వైసీపీ పరిపాలనా రాజధాని విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉంద‌న్న ఆయ‌న‌.. గత ప్రభుత్వం వేసిన అభివృద్ధి పునాది రాళ్లు సమాధి రాళ్లుగానే మిగిలాయ‌ని విమ‌ర్శించారు.. ఈ ప్రభుత్వం అభివృద్ధి దిశగా నడుస్తోంది. ప్రతిపక్షం మాట్లాడే అర్ధరహిత వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తున్నార‌ని అన్నారు స్పీక‌ర్ త‌మ్మినేని.. ఇక‌, మాన్సాస్ ట్రస్ట్ విషయం న్యాయస్థానం పరిధిలో ఉంది కాబ‌ట్టి.. న్యాయస్థానమే నిర్ణ‌యిస్తుంద‌న్నారు.