NTV Telugu Site icon

Tammineni Sitaram: చంద్రబాబు వెంటిలేటర్ మీద ఉన్న రాజకీయనేత

Tammineni Sitaram

Tammineni Sitaram

Tammineni Sitaram: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మార్కెట్ యార్డులో పెన్షన్‌లు పంపిణీ చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరిగేవి కాదని.. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య జరిగే ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. పెన్షన్‌లు తొలగించామని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని.. కానీ తాము పెన్షన్ పెంచి ఇస్తున్న సంగతి గుర్తించాలని హితవు పలికారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని లూటీ చేసి ఆలీబాబా 40 దొంగలు మాదిరిగా అందినకాడికి మింగేశారని తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు.

Read Also: Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ..

చంద్రబాబు ఏపీకి పట్టిన శనిగ్రహం అని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. చంద్రబాబు మీటింగ్ పెడుతుంటే జనాలు చనిపోతున్నారని.. ఎన్టీఆర్ పెట్టిన గుర్తు సైకిల్ కాకుండా చంద్రబాబు పీనుగు గుర్తుపెట్టుకోవాలని చురకలు అంటించారు. ప్రస్తుతం చంద్రబాబు వెంటిలేటర్‌పై ఉన్న రాజకీయ నాయకుడు అని.. ఆ వెంటిలేటర్ తీసేసి ప్రజలు ఈ రాష్ట్రానికి పట్టిన శని, కర్మ వదిలించుకుంటారని తమ్మినేని అన్నారు. కొంతమంది మాయమాటలతో, ముసుగులతో, మారు రూపంలో వస్తున్నారని.. ప్రజలు తస్మాత్ జాగ్రత్త మళ్లీ ఆ మాటల మాయలో పడవద్దని సూచించారు. చంద్రబాబునాయుడు అంతర్జాతీయ మాయల ఫకీరు లాంటివాడని తమ్మినేని విమర్శలు చేశారు.