AP Revenue Deficit: 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. వరుసగా మూడోసారి ఆయన బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. ఒకసారి ఒటాన్ అకౌంట్ బడ్జెట్.. రెండు సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల.. రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లగా అంచనా.
Read Also:
అయితే, రాష్ట్ర రెవెన్యూ లోటు గణనీయంగా తగ్గింది అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. 2025- 26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 41, 118.36 కోట్లుకు చేరింది. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 22, 002.50 కోట్లు ఉంది. 2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రూ. 80,567.47 కోట్ల ద్రవ్య లోటుగా నమోదు అయింది. ఇక, 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్య లోటు రూ. 75,868.09 కోట్లుగా ఉండొచ్చని అంచనా.
