NTV Telugu Site icon

ఆరుగురు మావోయిస్టు కీలక నేతల అరెస్ట్..!

DGP Gowtham sawang

DGP Gowtham sawang

మావోయిస్టుల కోసం నిరంతరం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. కూంబింగ్‌ జరుగుతోన్న కొన్ని సందర్భాల్లో మావోయిస్టులు ఎదురుపడడం.. కాల్పులు జరపడం.. అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు మృతిచెందిన ఘటనలు ఎన్నో.. చాలా సార్లు మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్న సందర్భాలున్నాయి… అయితే, తాజాగా మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తోంది… ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు స్పెషల్ పార్టీ పోలీసులు… అరెస్ట్ అయినవారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుండగా.. మిగతావారు ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. దీనిపై ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.. అదుపులోకి తీసుకున్న మావోయిస్టు కీలక నేతలను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.