అనంతపురం : ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు అర్థం కానీ రీతిలో వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని…చెత్త మీద కూడా పన్ను వేసే చెత్త పాలన సీఎం జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పరిపాలనలో జగన్, పోలీసులు తప్ప ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా కనపడటం లేదని ఎద్దేవా చేశారు.
read also : రాజధాని భూముల కుంభకోణంలో అధికారుల చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు !
ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడంలో మాజీ సీఎం చంద్రబాబు డిగ్రీ పట్టా తీసుకుంటే, సీఎం జగన్ డబుల్ డిగ్రీ పట్టాలు తీసుకున్నారని ఫైర్ అయ్యారు. జల విషయం పై ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలి గాని కేంద్రం పై వేయడం మంచిది కాదన్నారు. పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరల పెంపు పై బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలను నిలదీస్తామని…వైసీపీ ప్రభుత్వం లో పెయింటింగ్, ప్లెక్సీలు తప్ప ఏమి లేవని మండిపడ్డారు.