Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Ntr Vaidya Seva Scheme Stopped Private Hospitals Dues Issue

Aarogyasri AP : ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నిలిపివేత

Published Date :March 30, 2026 , 10:09 pm
By Gogikar Sai Krishna
  • ఏప్రిల్ 1 నుంచి వైద్య సేవలు నిలిపివేత
  • రూ.3000 కోట్ల బకాయిలపై ఆసుపత్రుల ఆగ్రహం
  • కొత్త UHC విధానంపై తీవ్ర అభ్యంతరాలు
  • పాత రేట్లతో సేవలు కష్టమంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్
Aarogyasri AP : ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నిలిపివేత
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) పథకం కింద వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు 3000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటం, కొత్తగా అమలు చేయాలనుకుంటున్న ‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్’ (UHC) విధానంపై అభ్యంతరాల నేపథ్యంలో ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించాయి. గత నాలుగు నెలల్లోనే ఈ బకాయిలు 2500 కోట్ల నుండి 3000 కోట్లకు చేరుకున్నాయని, వీటి చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ అందడం లేదని ఆసుపత్రుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Aishwarya Rajesh: మరో సీనియర్ హీరో సరసన ఐశ్వర్యా రాజేష్?

ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఇన్సూరెన్స్ మోడల్‌లో తీసుకురావాలని భావిస్తున్న కొత్త విధానంపై ఆసుపత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 2017 నాటి పాత ప్యాకేజీ ధరలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని, పెరిగిన వైద్య ఖర్చులు , ఆసుపత్రుల నిర్వహణ భారంతో పాత రేట్లకు వైద్యం అందించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నాయి. పాత బకాయిల సంగతి తేల్చకుండా కొత్త ఇన్సూరెన్స్ మోడల్‌లోకి మారితే, ఆ తర్వాత ఆ 3000 కోట్ల బాధ్యత ఎవరు తీసుకుంటారనే ఆందోళన ఆసుపత్రుల యాజమాన్యాలలో నెలకొంది. బకాయిలు అందకపోవడంతో చిన్న చిన్న ఆసుపత్రులు మూతపడే స్థితికి చేరుకున్నాయని, ఆర్థికంగా తాము తీవ్రంగా దెబ్బతింటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ హెచ్చరించారు. ప్యాకేజీ ధరలను సవరించి, బకాయిలను వెంటనే విడుదల చేయకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే రోడ్డెక్కి పోరాడతామని ఆసుపత్రుల సంఘం హెచ్చరించింది.

Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aarogyasri AP
  • Andhra Pradesh Health
  • ntr vaidya seva
  • private hospitals
  • UHC Policy

తాజావార్తలు

  • Aarogyasri AP : ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నిలిపివేత

  • Raja Raghuvanshi: ‘మా కొడుకు తిరిగి వచ్చాడు..’ రాజా రఘువంశీ మరణానంతరం జన్మించిన బిడ్డ.. భావోద్వేగానికి గురైన ఫ్యామిలీ

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Liquor Shop Holidays: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ తేదీల్లో మద్యం దొరకదు!

  • CSK Vs RR: చెన్నై పరువు కాపాడిన స్టార్ బౌలర్ ఓవర్టన్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన గైక్వాడ్ సేన..

ట్రెండింగ్‌

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions