Site icon NTV Telugu

కొలిక్కి వచ్చిన పీఆర్సీ చర్చలు.. ఉద్యోగుల సమ్మె విరమణ?

ఏపీలో ఎట్టకేలకు పీఆర్సీ చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి రెండు దఫాలుగా మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు విస్తృతంగా చర్చలు జరిపాయి. నిన్న, ఈరోజు రెండు రోజుల పాటు సుమారు 10 గంటల పాటు స్టీరింగ్ కమిటీ సభ్యుల సమావేశం సాగింది. ఉద్యోగ సంఘాల ప్రధాన అంశాలు హెచ్‌ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, రికవరీ రద్దు, ఐదేళ్ల పీఆర్సీపై ప్రభుత్వం సానుకూలంగా చర్చించినట్లు తెలుస్తోంది.

Read Also: ఫిట్‌మెంట్‌పై కీలక ప్రకటన చేసిన మంత్రుల కమిటీ

ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉద్యోగ సంఘాలకు ఊరట కలిగినట్లయింది. దీంతో సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి టెలీఫోన్ ద్వారా మాట్లాడతారని మంత్రులు తెలియజేశారు. అనంతరం మంత్రుల కమిటీ, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాయని.. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన చేయనున్నారని సమాచారం అందుతోంది. కాగా హెచ్ఆర్ఏ శ్లాబులను కనీసం 12% నుంచి అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయగా.. అది కష్టమని మంత్రుల కమిటీ తెలిపింది. దీంతో 10 శాతం, 12 శాతం, 16 శాతం శ్లాబులు నిర్ధారించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరగా.. మంత్రుల కమిటీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version