NTV Telugu Site icon

మాన్సాస్ ట్ర‌స్ట్‌పై హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తాం..

Vellampalli Srinivas

మాన్సాస్ ట్ర‌స్ట్‌పై హైకోర్టు తీర్పును స‌వాల్ చేసేందుకు సిద్ధం అవుతోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌దేశ్.. హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్.. ఇంకా, కోర్టు తీర్పు కాపీ పూర్తిగా చూడలేదు.. దీనిపై అప్పీల్‌కు వెళ్తామ‌ని తెలిపారు.. ఇక‌, మేం ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించ‌లేద‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. తీర్పులు ఒక్కోసారి అనుకూలంగా వస్తాయి, ఒక్కోసారి వ్యతిరేకంగా వ‌స్తాయ‌ని వ్యాఖ్యానించారు.. మ‌రోవైపు లోకేష్ కామెంట్ల‌పై స్పందించిన మంత్రి.. లోకేష్ చిన్నవాడు కాదు.. పెద్దవాడు కాదు.. ట్వీట్ల బాబుగా తయారు అయ్యాడంటూ సెటైర్లు వేశారు.. కాగా, మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను స‌వాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టును ఆశ్ర‌యించ‌గా.. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న త‌ర్వాత‌.. ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 72ను కొట్టివేసింది. మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం, మాన్సాస్ ట్ర‌స్ట్‌కు అశోక్ గ‌జ‌ప‌తి రాజునే చైర్మ‌న్ గా ఉండేలా ఆదేశాలు జారీచేసింది. గ‌తంలో మాన్సాస్‌, మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం ట్ర‌స్ట్‌ల‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఆయ‌న‌ను త‌ప్పిస్తూ ప్ర‌భుత్వం జీవో 72ను జారీ చేసింది.. ఇక‌, ఆయ‌న స్థానంలో సంచ‌యిత‌ను ట్ర‌స్ట్ చైర్మ‌న్‌గా ఏపీ ప్ర‌భుత్వం నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.