Site icon NTV Telugu

Minister Narayana: వైసీపీ వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు..

Minister Narayana

Minister Narayana

Minister Narayana: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 45వ సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ లో మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014- 19లో 43 వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచాం.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడింది అన్నారు. రాజధాని పనులు ఆగిపోయాయి.. మేము అధికారంలోకి వచ్చాక మొదటి క్యాబినెట్ లోనే రాజధానిపై నిర్ణయం తీసుకున్నాం.. ఈ ప్రభుత్వం రాగానే రాజధానికి సంబంధించి కొన్ని కమిటీలు ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. జీవోఎంలో తీసుకున్న నిర్ణయాలు సీఆర్డీఏలో పెట్టామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Read Also: Volkswagen ID Every1: వోక్స్‌వ్యాగన్ చౌకైన ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్ ఐడి ఆవిష్కరణ.. సింగిల్ ఛార్జ్ తో 250KM రేంజ్

ఇక, 31 సంస్థలకు పనులు ఇవ్వడానికి ఆమోదం తెలిపామని మంత్రి నారాయణ చెప్పారు. వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు.. ఈ రాజధానికి అయ్యే ఖర్చు ప్రజల పన్నుల నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టము.. అమరావతి కాపిటల్ సిటీలో 6 వేల ఎకరాలు సీఆర్డీఏకు మిగిలింది.. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి.. రకరకాల మార్గాలతో కాపిటల్ సిటీ కడతాం.. ల్యాండ్ రేట్ పెరిగిన వెంటనే ఆక్షన్ కో భూములను ఆమ్మడం వలన అభివృద్ధి జరుగుతుంది మంత్రి నారాయణ తెలిపారు.

Exit mobile version