Site icon NTV Telugu

Minister Karumuri Nageswara Rao: అమరావతి భూమి భారీ నిర్మాణాలకు అనువైంది కాదు..!

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి.. ఈ సారి మూడు రాజధానుల బిల్లు శాసనసభ ముందుకు వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. అమరావతి రైతుల మహా పాదయాత్ర రెండో విడత ప్రారంభమైంది.. ఈ నేపథ్యంలో.. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు, ల్యాండ్‌ ఫూలింగ్‌ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ల్యాండ్ పూలింగ్ విషయంలో ఐఏఎస్ చెరుకూరి శ్రీధర్ సహా ఎవ్వరు తప్పు చేసినా వదిలేది లేదని స్పష్టం చేశారు.. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయి.. ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేశారని.. మరిన్ని నిజాలు.. త్వరలో వెలుగులోకి వస్తాయన్నారు..

Read Also: PVN Madhav: మూడు రాజధానులపై బీజేపీ వైఖరి అదే.. స్పష్టంగా చెబుతున్నాం..

ఇక, మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ నిర్ణయం అన్నారు మంత్రి నాగేశ్వరరావు.. అమరావతి ప్రాంతంలో భారీ నిర్మాణాలకు భూమి అనువైంది కాదన్న ఆయన.. అమరావతి అభివృద్ధికి నాలుగు లక్షల కోట్లు అవసరం.. అమరావతిలోనే నాలుగు లక్షలు కోట్లు పెడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పు.. మళ్లీ జరగకూడదనే మా అభిమతం అన్నారు.. మరోవైపు.. అమరావతి పాదయాత్ర కాదిది చంద్రబాబు అండ్ కో చేస్తున్న యాత్రగా ఫైర్‌ అయ్యారు ఏపీ మంత్రి.. ఢిల్లీలో రైతులు చేసిన ఆందోళన నూటికి నూరు శాతం రైతుల ఆందోళనే… కానీ, అమరావతి రైతుల పేరుతో చేసే యాత్రలో రైతులే లేరని ఎద్దేవా చేశారు.. రిస్ట్ వాచీలు.. బౌన్సర్లతో పాదయాత్ర చేసే వారిని పాదయాత్ర అంటారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.

Exit mobile version