NTV Telugu Site icon

Jogi Ramesh: పవన్ కల్యాణ్‌ ఇంటి దగ్గర రెక్కీ.. ఇలా స్పందించిన మంత్రి జోగి రమేష్

Jogi Ramesh

Jogi Ramesh

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఇంటి దగ్గర రెక్కీ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.. హైదరాబాద్‌లోని పవన్‌ ఇంటి దగ్గర రెక్కీ, సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణ హాట్‌ టాపిక్‌ అయిపోయింది.. పవన్‌ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మన నేతను గుర్తుతెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నారు.. ఏం జరుగుతోందో ఏమో అని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, పవన్‌ విశాఖ పర్యటన తర్వాతే ఇలా జరుగుతోందని.. ప్రభుత్వం కుట్ర చేస్తుందని జనసేన, విపక్షాలు మండిపడుతున్నాయి.. తాజాగా, పవన్ కల్యాణ్‌ ఇంటి దగ్గర రెక్కీ అంశంపై స్పందించారు మంత్రి జోగి రమేష్… వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎవరిపై రెక్కీలు నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ఆయన… 420 బ్యాచ్ రెక్కీ చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు… ఇక, శత్రువు కూడా బాగుండాలని మేం భావిస్తాం అని వ్యాఖ్యానించారు మంత్రి జోగి రమేష్‌.

Read Also: CM KCR Press Meet: కాసేపట్లో కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌.. విషయం ఇదేనా..?

మరోవైపు చంద్రబును టార్గెట్‌ చేశారు జోగి రమేష్.. చంద్రబాబు వృద్ధ నారా పతివ్రత అంటూ ఘాటుగా స్పందించిన ఆయన.. విలువలు.. విశ్వసనీయత… రాజ్యాంగం ప్రజాస్వామ్యం.. అని బాబు తెగ చెబుతున్నాడు.. అయ్యన్న అక్రమించుకుంటే. అరెస్ట్ చేస్తారా? అని బాబు చెబుతున్నాడు. ఆక్రమణ తప్పు కాదా..? అని నిలదీశారు.. ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం తప్పే అని చెప్పి.. ఊగిపోతు మాట్లాడుతున్నాడు.. టీడీపీకి సొంత రాజ్యాంగం ఏమైనా రాశారా? అని ఎద్దేశా చేశారు. ప్రభుత్వ స్థలాలను అక్రమించుకుంటే ఒకే… కానీ, కేసు పెట్టకూడదా..? అని ప్రశ్నించారు.. లాగేసాను.. పీకేస్తాను అంటున్నాడు చంద్రబాబు.. ఏంటి వచ్చేది.. ఎవర్ని బెదిరిస్తున్నారు చంద్రబాబు? అంటూ ఫైర్‌ అయ్యారు. అయ్యన్న పాత్రుడు 420 పని చేస్తే బీసీలకు ఏం సంబంధం? అని సెటైర్లు వేసిన ఆయన.. బాబు ఎంత లేపినా టీడీపీ లేవదు.. బీసీలను రెచ్చగొట్టాలని బాబు చూస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు.