Site icon NTV Telugu

Minister Jogi Ramesh: కుప్పంలోనే దిక్కు లేదు.. పులివెందులను టచ్ చేసే ధైర్యం ఉందా?

Jogi Ramesh

Jogi Ramesh

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలుచేశారు ఏపీ మంత్రి జోగి రమేష్‌… తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సెప్టెంబర్ 1న తాను మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యానని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడు. వెన్నుపోటు పొడిచిన రోజును పండుగ చేసుకోవడానికి చంద్రబాబుకు సిగ్గు ఉందా? అంటూ ఫైర్‌ అయ్యారు. సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి.. ఊరు, వాడ, ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ వైఎస్‌ను గుర్తుకు తెచ్చుకునే రోజు.. ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే వైఎస్ పాలన సాగింది.. అయినా ఇప్పటికీ రాజశేఖర్‌రెడ్డిని తలుచుకోని గుండె ఉండదన్నారు.. అందుకే సెప్టెంబర్ 2ను డైవర్ట్ చేయటానికి చంద్రబాబు రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Minister Ambati Rambabu: అన్ని ప్రాజెక్టుల గేట్లు రిపేర్‌లోనే.. ఇది వాస్తవం..

ఈ డిసెంబర్ నాటికి రెండు లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకు అందించామని గర్వంగా చెప్పగలం అన్నారు మంత్రి జోగి రమేష్.. చంద్రబాబుకు తన పై ఉన్న ఆరోపణలపై విచారణ చేయించుకునే ధైర్యం ఉందా? కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోకుండా ఉండగలవా? అని ప్రశ్నించారు. ఇక, ప్రతి గడపకు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి వెళుతున్నారు.. మాకు పోలీసులతో ఏం పని? అన్న ఆయన.. చంద్రబాబు పులివెందులను టచ్ చేసే ధైర్యం ఉందా? ఉంటా సవాల్‌ చేశారు.. అసలు కుప్పంలోనే చంద్రబాబుకు దిక్కు లేదు అంటూ ఎద్దేవా చేశారు.. కుప్పంలో ఒక్క సర్పంచ్ లేడు, ఒక జడ్పీటీసీ లేడు.. ఒక్క ఎంపీటీసీ లేడు అని సెటైర్లు వేశారు. భారతదేశంలో చంద్రబాబు తప్పా ఇంకా మేధావులు లేరు? అందుకే ప్రధాని నరేంద్ర మోడీ.. చంద్రబాబు సలహాలు అడిగారు ‌… చెప్పటానికి అయినా సిగ్గు ఉండాలి..! అని ఎద్దేవా చేశారు మంత్రి జోగి రమేష్‌.

Exit mobile version