Site icon NTV Telugu

Minister Chelluboina Venu: అమరావతి యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు.. అందుకే వారిని దేవుడు రానివ్వడం లేదు..!

Minister Chelluboina Venu

Minister Chelluboina Venu

అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి టు అరసవెల్లి పాదయాత్రపై కామెంట్లు చేసిన ఆయన.. అమరావతి రైతుల యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు.. అందుకే ఎక్కడికీ వారిని దేవుడు రానివ్వడం లేదని పేర్కొన్నారు.. ఇక, కల్లు గీత కార్మికుల జీవితాల్లో భరోసా కల్పించే పాలసీ తెచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి.. గీత కార్మికుడు ఏదైనా ప్రమాదానికి గురై చనిపోతే 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని మంచి నిర్ణయం తీసుకున్నారన్న ఆయన.. తాటి చెట్టు రాష్ట్ర వృక్షంగా ఉన్న తమిళనాడులోనూ ఇంత ఎక్స్ గ్రేషియా లేదన్నారు.. పక్క రాష్ట్రం తెలంగాణలోనూ 5 లక్షలు మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఉంది.. చంద్రబాబు కాలంలో ఇంటింటికీ బెల్ట్ షాపు పెట్టి.. గీత కార్మికులకు జీవన భృతి లేకుండా చేశారని మండిపడ్డారు.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కోసం తాడిచెట్లు లేకుండా చేసింది నువ్వు కాదా? ఆదరణ పథకంలో కేవలం 14 వేల మందికి మోకులు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు 2 లక్షల మంది ఉన్నారు అంటాడు.. వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది అంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

Read Also:DAV Public School: డీఏవీ స్కూల్‌కు మళ్లీ అనుమతి.. విద్యాశాఖ కీలక ఆదేశాలు

టీడీపీ ఎజెండానే అబద్దం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి వేణుగోపాల కృష్ణ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాలు బీసీల జీవితాల్లో మార్పు తెస్తున్నాయన్న ఆయన.. చంద్రబాబు చేతిలో మోసపోయింది మాత్రం బీసీలే.. పార్లమెంట్ స్థాయిలో బీసీ మీటింగులు పెట్టీ ఆయన బీసీలకు చేసిన అన్యాయాలను చెప్తాడా…? అంటూ ఎద్దేవా చేశారు.. నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తా అన్నది, మత్స్యకారులను తోలు తీస్తా అన్నది ఎవరూ మర్చిపోలేదన్నారు. మరోవైపు. అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. రైతుల ముసుగు తొలగింది.. .న్యాయస్థానం కూడా న్యాయం వైపు నిలిచిందన్నారు. మా ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి ఇది చేశాను అని చెప్తున్నాడు.. నీ 14 ఏళ్లలో ఏమీ చేసావో ఇంటింటికీ వెళ్లి చెప్పగలవా? అని నిలదీశారు.. బీసీల జీవితాలని మూడు తరాలు వెనక్కి వెళ్లేలా చేసిన వ్యక్తి చంద్రబాబు.. బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదన్న ఆయన.. బీసీలు తను చెప్పినట్లు ఆడే కీలు బొమ్మలు, తోలు బొమ్మలు అనుకుంటున్నాడు.. ఇక చంద్రబాబును ఏ ఒక్క బీసీ కూడా నమ్మరని స్పష్టం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.

Exit mobile version