కోవిడ్ నిబంధనలు పాటించండి.. కేరళ పరిస్థితి రావొద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటించకుంటే కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓనమ్ పండుగ తర్వాతే కేరళలో మళ్లీ కోవిడ్ కేసులు విజృంభించాయని గుర్తుచేశారు… కరోనా నిబంధనలు పాటించాలని అలాంటి పరిస్థితి తీసుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ పలుచోట్ల కోవిడ్ పాజిటివిటీ రేటు 13శాతం ఉందని గుర్తుచేసిన మంత్రి.. వినాయక చవితిని ఇళ్లలోనే జరుపుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు. అయితే, పండుగలను కూడా కొన్ని పార్టీలు రాజకీయం చేయడం దురదృష్టకరం అని మండిపడ్డ మంత్రి వేణు గోపాలకృష్ణ.. అన్ని మతాలను సీఎం వైఎస్ జగన్ సమదృష్టితో చూస్తారని స్పష్టం చేశారు. కాగా, వినాయక చవిత ఉత్సవాలకు అనుమతి ఇచ్చిన ఏపీ హైకోర్టు.. పబ్లిక్ ప్లేస్ల్లో కాకుండే ప్రైవేట్ ప్లేస్ల్లో పెట్టుకోవాలని.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఒక్కసారి ఐదుగురికి మించకుండా చూసుకోవాలంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!