NTV Telugu Site icon

Minister Appalaraju: అది చంద్రబాబుకి బాదుడే బాదుడు యాత్ర..!

వరుసగా అన్ని చార్జీలు పెరిగిపోయాయంటూ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న టీడీపీ… వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రపై సెటైర్లు వేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. చంద్రబాబు చేస్తున్న యాత్ర చంద్రబాబుకి బాదుడే బాదుడు యాత్ర అవుతుందన్న ఆయన.. శవాల వద్దకే చంద్రబాబు యాత్ర అని పేరు పెట్టుకోవాలని.. ఎందుకంటే చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

Read Also: Nadendla Manohar: ఓట్లు చీలకూడదు.. జగన్‌ను ఓడించాలి.. !

ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తే చంద్రబాబు ఎందుకు తట్టుకోలేక పోతున్నారని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు.. ఇంగ్లీష్ మీడియంపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిలదీసిన ఆయన.. తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఎందుకు చంద్రబాబు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు. కాగా, విజయనగరం జిల్లాలో మంత్రులు బొత్స, సీదిరి అప్పలరాజు పర్యటించారు.. గరివిడిలో వెటర్నరీ కాలేజ్, స్టూడెంట్స్ హాస్టల్‌ను ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి పాల్గొన్నారు.. కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజును మంత్రి బొత్స సత్యనారాయణ సత్కరించగా.. బొత్స కాళ్లకు నమస్కరించారు సీదిరి అప్పలరాజు.