Site icon NTV Telugu

తెలుగు దేశం పార్టీ కాదు తెలంగాణ దేశం పార్టీ : ఏపీ మంత్రి

Anil Kumar Yadav

Anil Kumar Yadav

ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాలు, జిల్లాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడని… ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు రాసిన లేఖ దాన్ని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు. తెలుగు దేశం కాస్త… తెలంగాణ దేశం పార్టీగా అవతరిస్తోందని నిప్పులు చెరిగారు. గుండ్లకమ్మ, రామతీర్థం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ చేశారని… చంద్రబాబు తన ప్రాంతానికి ఏమి చేశాడో చెప్పాలని చురకలు అంటించారు.

read also : సీమకే కాదు ఉమ్మడి ఏపీకి అన్యాయం చేసింది చంద్రబాబే !

వైఎస్ జగన్ వచ్చాక వెలిగొండ మొదటి టన్నెల్ పూర్తి చేసి రెండో టన్నెల్ 2023 లోపు పూర్తి చేస్తామని… ప్రకాశం జిల్లాకు నీళ్ళందించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణా వాదాన్ని చంద్రబాబు ఈ రాష్ట్రంలో వినిపిస్తున్నారని…వరికపూడిసెలలో లక్ష ఎకరాలకు నీళ్ళందించేందుకు సీఎం జగన్‌ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కరువుతో అల్లాడుతున్న చిత్తూరు జిల్లాలో కేసులు వేయించించిన నీచమైన సంస్కృతి చంద్రబాబుది కాదా ? అని ప్రశ్నించారు. బాబు సొంత జిల్లాలో జలాశయం కడితే ఓర్చుకోలేక కేసు వేయించారన్నారు.

Exit mobile version