సీమకే కాదు ఉమ్మడి ఏపీకి అన్యాయం చేసింది చంద్రబాబే !

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాయలసీమకే కాదు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేశాడని ఫైర్‌ అయ్యారు. “సీమకే కాదు ఉమ్మడి ఏపీకి అన్యాయం చేసింది చంద్రబాబే. నీటి కేటాయింపులు లేకుండా కర్నాటక ఆల్మట్టి డ్యాం నిర్మిస్తుంటే అప్పటి ప్రధాని దేవెగౌడకు ఆగ్రహం కలుగుతుందని నోరు మూసుకున్నది ఎవరు? 14 ఏళ్లు సీఎంగా ఉండి బాబు పూర్తి చేసిన ప్రాజెక్టు ఒకటైనా ఉందా?” అంటూ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.

read also : మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్‌


ఇక అంతకు ముందు ట్వీట్‌ లో “దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమంది పచ్చమీడియా. యెల్లో ముసుగేసుకున్న డర్టీ మీడియా అధినేతల తీరు మరీ దారుణం. 41 వేల కోట్ల లావాదేవీలకు లెక్కల్లేవని హెడ్డింగులు పెట్టేశారు. టీవీల్లో డిబేట్లతో ఊదరగొట్టేశారు. తూచ్ అని తేలిపోయాక అంతా గప్‌చుప్. బిల్లులు లేకపోవడానికి హెరిటేజ్ కొట్టా ఇది?” అంటూ విజయసాయి రెడ్డి చురకలు అంటించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-