Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 2025 మెగా డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం చేయగా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు అధికారికంగా తుది జాబితాను రిలీజ్ చేశారు. అయితే, ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16, 347 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సరైన అర్హత కలిగిన అభ్యర్థులు రాకపోవడంతో, చివరికి 15,941 పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ తుది జాబితా ప్రకారం ఎంపికైన వారిలో 49 శాతం మహిళలు ఉన్నారు.
Read Also: Shaheen Afridi: షాహిన్ అఫ్రిది దొరికాడో.. ఉరికించి ఉరికించి కొడతాం!
ఇక, మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మెగా డీఎస్సీ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది.. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. కేవలం 150 రోజుల్లోనే విద్యా శాఖ డీఎస్సీని పూర్తి చేసింది అన్నారు. అయితే, ఈసారి డీఎస్సీలో అవకాశం రాని వారు నిరాశ చెందవద్దు.. ఇక నుంచి ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ నియామక ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 3,36,300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి నుంచి మొత్తం 5,07,675 అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి డీఎస్సీ పట్ల అభ్యర్థుల చాలా ఆసక్తిని చూపించారు.
Read Also: Trump: ఆ సమయం ముగిసింది.. డల్లాస్ భారతీయుడి హత్యపై ట్రంప్ సంచలన ప్రకటన
అయితే, ఫైనల్ లిస్ట్‌లో ఎంపికైన వారికి ఈ నెల 19వ తేదీన నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం అభ్యర్థుల పోస్టింగ్‌ల కేటాయింపుకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా, ఫైనల్ లిస్ట్‌ను డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. కొత్తగా హారిజాంటల్ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చినట్లు విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ చెప్పుకొచ్చారు. ఏవైనా సందేహాలు ఉంటే, సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లను అభ్యర్థులు సంప్రదించవచ్చని తెలిపారు.
