Site icon NTV Telugu

AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ఎంపీ మిథున్ రెడ్డి విడుదల.. ఆ ముగ్గురికి బెయిల్!

Mithunreddy

Mithunreddy

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ31గా ధనుంజయ్ రెడ్డి, ఏ32గా కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33గా ఉన్న బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురి పాస్‌పోర్ట్‌లను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

Read Also: Bowel Cancer: షాకింగ్ అధ్యయనం.. మాంసం, మద్యం తాగే యువతకు పెద్దపేగు క్యాన్సర్..!

ఇక, లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సెట్ అధికారులు జూలై 20న అరెస్ట్ చేయగా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదిగా ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు మిథున్ రెడ్డి వేసిన రెగ్యులర్ బెయిల్ ను కోర్టు తిరస్కరించింది. అయితే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కు న్యాయస్థానం అంగీకరించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మిథున్ రెడ్డికి ఓటు వేసేందుకు అనుమతి దొరికింది. అలాగే, ఈనెల 11వ తేదీన తిరిగి కోర్టులో సరెండర్ కావాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Viral: పాకిస్థాన్ లో ఘనంగా వినాయక నిమజ్జనం

కాగా, జైలు నుంచి విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పలువురు పార్టీ నేతలు, శ్రేణులు కలిసి పరామర్శించారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే తమ పార్టీ ఎంపీలు మద్దతు ఇస్తున్నట్లుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ పరిణామంతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version