Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Industrial Clusters Global Brands Chandrababu Review

CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష

Published Date :May 4, 2026 , 5:12 pm
By Gogikar Sai Krishna
  • గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు
  • పారిశ్రామిక క్లస్టర్లకు లాజిస్టిక్స్ కనెక్టివిటీ
  • రవాణా వ్యయం తగ్గించటమే కీలకమైన అంశం
  • ఇండస్ట్రీ- ఇన్ఫ్రా- టూరిజం అంశాలపై ప్రత్యేక దృష్టి
  • ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష
CM Chandrababu  : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రాంతాల్లో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం( భవ్య పథకం) కింద చేపట్టనున్న పారిశ్రామిక పార్కులు, కెమికల్ పార్కుల అభివృద్ధి పై సీఎం చర్చించారు.

2026-27లో ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్ పార్క్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, కంటైనర్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ సహా 175 ఎంఎస్ఎంఈ పార్కులను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేసే అంశంపై సమీక్షలో చర్చించారు. పారిశ్రామిక పార్కుల్లో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ తో పాటు లాజిస్టిక్స్ ను కూడా అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. నీరు, విద్యుత్, కోల్డ్ చైన్, వేర్ హౌసింగ్ లాంటి మౌలిక సదుపాయాలు ఈ లాజిస్టిక్స్ పార్కులకు అనుసంధానమయ్యేలా చూడాలన్నారు. ప్రత్యేకించి రవాణా వ్యయం తగ్గితే ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. పారిశ్రామిక క్లస్టర్లకు రైల్, రోడ్, పోర్టు కనెక్టివిటీ జరిగేలా లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్ మ్యాపింగ్ జరగాలని సూచనలు చేశారు.

Also Read

  • YS Jagan : విజయ్‌కు జగన్ అభినందనలు.. 'తొలి అడుగులోనే అద్భుతం' అంటూ ట్వీట్.!
  • Pawan Kalyan : విజయ్'ని మనసారా అభినందిస్తున్నా
  • Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..
  • Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?

స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు నాణ్యత పెరిగితేనే గ్లోబల్ స్థాయికి చేరుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉత్పత్తులకు స్థానికంగా, ప్రాంతీయంగా, దేశ, విదేశీ మార్కెట్లకు చేరేలా చూడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల్లోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారయ్యేలా ప్రోత్సాహం కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. పారిశ్రామిక క్లస్టర్లలో ఫార్మర్స్ ప్రోడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేయటం ద్వారా రైతులకూ ప్రయోజనం కల్పించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం ద్వారా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రసాయనాల తయారీ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమలు- మౌలిక సదుపాయాలు- పర్యాటకం అనే విధానంలో ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

ప్రతీ జిల్లాలోనూ ఓ మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కలుగుతాయన్నారు. ప్రతీ పారిశ్రామిక క్లస్టర్ వద్దా ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా ఏపీ ఎంఎస్ఎంఈల స్థాపనలో అగ్రస్థానంలో ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ జరగాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం యూనివర్సిటీల్లోనూ కోర్సులను హైబ్రీడ్ విధానంలో అందించే ఆలోచన చేయాలన్నారు. సమీక్షకు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎస్ సాయి ప్రసాద్, పరిశ్రమలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాలు, అటవీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap development
  • AP Industrial Policy
  • Chandrababu Naidu
  • Logistics Connectivity
  • MSME Clusters

తాజావార్తలు

  • Election Results 2026: తమిళనాడులో హంగ్‌కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్‌డేట్స్ మీకోసం..

  • CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష

  • YS Jagan : విజయ్‌కు జగన్ అభినందనలు.. ‘తొలి అడుగులోనే అద్భుతం’ అంటూ ట్వీట్.!

  • Kavitha: పాత రాజకీయాలకు విసిగిపోయారు.. తెలంగాణలో కూడా మార్పు తథ్యం: కవిత

  • TVK Super Hit : తమిళ రాజకీయాల్లో పెను సంచలనం.. విజయ్ ‘టీవీకే’ సూపర్ హిట్..!

  • Pawan Kalyan : విజయ్’ని మనసారా అభినందిస్తున్నా

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions