Blind Girl Murder Case: తాడేపల్లిలో అంధ బాలిక హత్యపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blind Girl Murder Case: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో మైనర్ బాలిక దారుణ హత్యకు గురైన విషయం విదితమే.. ఆ అంధ బాలిక హత్యపై హోంమంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు.. ఆ బాలికను గంజాయి మత్తులో హత్య చేయలేదు.. వ్యక్తిగత కక్షతోనే అంధ బాలికను హత్య చేశారని స్పష్టం చేశారు.. అయితే, ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజంలేదని కొట్టిపారేశారు హోంమంత్రి తానేటి వనిత.. కాగా, తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలిపై అదే ప్రాంతంలో ఉంటున్న దుండగుడు రాజు కత్తితో దాడి చేశాడు. తలపై కొట్టడంతో తీవ్రగాయాలపాలైన యువతి.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత తల్లి వచ్చేసరికి మృతి చెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన బిడ్డను రాజు అన్యాయంగా చంపేశాడని మృతురాలి తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. గంజాయి సేవించి వచ్చి, తన కూతురుపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతోంది. గంజాయి ముఠా ఆగడాలు పెరిగి పోయాయని… తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా చూడాలని వేడుకుంది.
Read Also: Tourist Police Stations: టూరిస్ట్ పోలీస్ స్టేషన్లకు శ్రీకారం.. 26 పీఎస్‌లను ప్రారంభించిన సీఎం జగన్
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
మైనర్ బాలిక హత్యపై రాష్ట్ర మహిళ కమిషన్ స్పందించింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని మృతదేహాన్ని పరిశీలించిన మహిళ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. TDP కార్యకర్తల తీరుపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫైరయ్యారు. టీడీపీ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలంటూ మండిపడ్డారు. అంధ బాలిక హత్య… శాంతి భద్రతల వైఫల్యమే అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి ఇంటికి దగ్గరలో ఘాతుకాలు జరుగుతున్నా… ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. రాజు చేతిలో కిరాతంగా హత్యకు గురైన బాలిక కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలంటూ ఉదయం నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద మహిళ సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మైనర్ బాలిక కుటుంబానికి 10లక్షలతో పాటు ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మహిళ సంఘాలు రాత్రి దీక్ష విరమించుకున్నాయి. మైనర్‌పై దారుణానికి ఒడిగట్టిన రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి రాజుకి నేర చరిత్ర కూడా ఉంది. గతంలోనూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. హత్యయత్నం కేసుతో పాటు చాలా కేసులో రాజు నిందితుడిగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!